అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఫ్లై ఓవర్ నైట్ వ్యూ శోభితం డ్రోన్ కెమెరా షాట్స్ సోమవారం రాత్రి ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్న విషయం తెలిసిందే. కాకపోతే దాదాపు 16 నెలలు ప్రజలు ట్రాఫిక్ సమస్యతో నూ అలాగే చుట్టూ తిరిగి వెళ్ళడానికి పట్టే అధిక సమయానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కావున బ్రిడ్జి ప్రారంభించిన తర్వాత అనంతప్రజలు అక్కడికి చేరుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు.