సినిమా ప్రియులకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. థియేటర్లో సినిమా రిలీజ్ అయ్యే రోజునే ఫైబర్‌నెట్‌లో చూసే సదుపాయం అందుబాటులోకి తెచ్చామని APఫైబర్‌నెట్ ఛైర్మన్ గౌతంరెడ్డి వెల్లడించారు. ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది మా స్లోగన్ అని ఆయన చెప్పారు. APSFL కూడా ఒక థియేటర్ లాంటిందన్నారు. జూన్ 2 విశాఖలో దీన్ని అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన వివరించారు.