శృంగవరపుకోట నియోజకవర్గ సామి మండలం చింతాడ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఓ కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న అరటి తోటలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, దీంతో గమనించిన స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, గాయాల పాలైన వ్యక్తులను శృంగవరపుకోట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa