ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గంగపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మండల పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొంటారాని తెలిపారు. అలాగే ఆర్బికే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. కావున నాయకులు, అధికారులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.