తిరుపతి జిల్లా, నల్లమల ఆత్మకూరులో మార్చి 6న తల్లి పులి నుంచి తప్పి పోయిన 4 పులి కూనల్లో ఒకటి తిరుపతి జూలో మృతి చెందింది. పులికూనలను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నాలు విఫలం కావడంతో తిరుపతి జూ పార్కుకు మార్చ్ 9 న అటవీ శాఖ అధికారులు తీసుకొచ్చారు. జూలోని వెటర్నరీ ఆస్పత్రిలో ప్రత్యేక ఏసీ గదిలో పులి పిల్లలు అప్పటి నుంచి ఉన్నాయి. తెచ్చినప్పటి నుంచి మూడు పిల్లలు ఆక్టివ్‌గా ఉన్నాయి. నాలుగో పిల్ల మాత్రం బలహీనంగా ఉంది. ఈ నాలుగో పిల్ల చివరిగా పుట్టినది కావడంతో వీక్ గా ఉందని వైద్యులు భావించారు. అయితే అది తాజాగా కిడ్నీ, శ్వాసకోశ సమస్యలతో మృతి చెందింది. తిరుపతి వచ్చినప్పుడు కంటే నాలుగో పులి పిల్ల బరువు పెరిగింది. అయినా కూడా మృతి చెందింది. పోస్ట్ మార్టం శ్యాంఫుల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు.