గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో స్వాధీనం చేసుకున్న గంజాయిని త్వరగా నిర్వీర్యం చేయాలని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. మంగళగిరి రూరల్, పట్టాభిపురం, పొన్నూరు పోలీస్టేషన్ల (పీఎస్) పరిధిలో సీజ్ చేసిన డైలిక్విడ్ గంజాయిని బుధవారం గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కు తరలించగా ఎస్పీ పరిశీలించారు. కొద్ది రోజులుగా ఆయా పీఎస్ పరిధిలో స్వాధీనం చేసుకున్న సుమారు 476 కిలోల డ్రై/లిక్విడ్ గంజాయిని పద్ధతి ప్రకారం డిస్పోజల్ చేయాలని ఎస్పీ ఆదేశించారు.