ఇటీవల విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలలో గుంటూరు నగరం శ్యామల నగర్ కు చెందిన ప్రణవ్ 60 ర్యాంకు సాధించి ఐఏఎస్ కు అర్హత పొందాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తన గృహంలో ప్రణవ్ ను గురువారం సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఐఏఎస్ కేడర్ ద్వారా ప్రజలకు సేవలందించవచ్చని, సంక్షేమ- అభివృద్ధి పథకాలలో ముఖ్య పాత్ర పోషించవచ్చని తెలిపారు. ప్రణీవ్ కు ఆంధ్ర క్యాడర్ కేటాయించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రణవ్ విజయాన్ని సివిల్ సర్వీస్ అభ్యర్థులు ప్రేరణగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ కు ఎంపికైన అశ్విన్ మణిదీప్, సన్ యూనియన్ ఫర్ నేషన్ యశ్వంత్, విజయ్ కుమారి పాల్గొన్నారు.