ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరారు. నేడు ఐదో ఏడాది.. తొలి విడత వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనునున్న సీఎం వైయస్ జగన్. 2023–24 సీజన్‌కు సంబంధించి 52.31 లక్షల రైతు కుటుంబాలకు తొలివిడతగా రూ.7,500 చొప్పున మొత్తం రూ.3,923.22 కోట్ల పెట్టుబడి సాయంతో పాటు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన 51 వేల మంది రైతులకు రూ.53.62 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం జగన్ గురువారం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించే కార్యక్రమంలో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.