మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొల్లు రవీంద్రను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా రవీంద్ర ఇంటికి చేరుకుంటున్నారు. మూడు రోజుల క్రితం ఇంగ్లీష్ పాలెంలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసేందుకు రవీంద్ర చిలకలపూడి పోలీస్స్టేషన్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారన్న కారణంతో హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రవీంద్ర ఇంటికి చేరుకున్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొల్లు రవీంద్రతో ఇనగుదురుపేట సీఐ ఉమామహేశ్వరరావు చర్చలు నిర్వహిస్తున్నారు.