పెదకాకాని గ్రామంలోని మద్దిరాల కాలనీలో నివాసముంటున్న ప్రమీల వద్ద అతని మరిది కొడుకు యశ్వంత్ గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత బుధవారం ఇంటి నుంచి వెళ్లి యశ్వంత్ తిరిగి రాకపోవడంతో బంధువులను విచారించి ఆచూకీ తెలియకపోవటంతో ప్రమీల గురువారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీఐ బండారు సురేష్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాడు.