రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ఓబులవారిపల్లి మండలం మంగంపేట నందు కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మంగంపేట కార్మికుల కోసం ఆహర్నిశలు పనిచేసిన కామ్రేడ్ శంకరయ్య విగ్రహవిష్కరణను శుక్రవారం కడప జిల్లా కమ్యూనిస్టు పార్టీ మాజీ కార్యదర్శి లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగంపేటలో ముగ్గురాయి గనిలో మొట్టమొదటిసారిగా కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు యూనియన్ స్థాపించిన నాయకుడు శంకరయ్య అని కొనియాడారు. ఆయన లేని లోటు కమ్యూనిస్టు పార్టీకి తీవ్ర నష్టమని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa