రాష్ట్రం విడిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతున్న చంద్రబాబుకు అసలు మైండ్ ఉందా? చెడిపోయిందా..? తను ఆ పని చేయడమే కాకుండా, సీఎం శుభాకాంక్షలు చెప్పడం లేదని నిందిస్తున్న చంద్రబాబు.. పూర్తిగా గతి తప్పారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన తేదీన, నల్ల బ్యాడ్జీలు పెట్టి ఎన్నో డ్రామాలు చేశారని, రాష్ట్రం విడగొట్టారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను, రాహుల్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడన్నారు. అదే రాష్ట్ర విభజనను గట్టిగా సమర్థించిన బీజేపిని మాత్రం ఏనాడు ఒక్క మాట అనలేదని గుర్తుచేశారు.