ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 280 పైగా మృత దేహాల వెలికితీశారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇంతవరకు ఎంత మంది మృతి చెందారు. ఎంతమంది గాయపడ్డారన్నది స్పష్టంగా ఇంకా తెలియరాలేదు. ఇదిలావుండగా రైలులో వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులున్నారు. దీంతో రైలులో ప్రయాణిస్తున్నవారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. వీరి కోసం వాల్తేరు రైల్వే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచింది. విశాఖ రైల్వే స్టేషన్‌లో హెల్ప్‌లైన్ నంబర్లు 08912746330, 08912744619, విజయనగరం జిల్లాలో 08922-221202, 08922-221206, శ్రీకాకుళం జిల్లాలో 08942-286213, 08942-286245 నంబర్లను అందుబాటులో ఉంచింది. ఆయా రైల్వే స్టేషన్లకు చాలా మంది తమ బంధువుల ఆచూకీ కోసం సంప్రదిస్తున్నారు. 24 గంటలూ హెల్ప్‌లైన్ నంబర్లలో సమాచారం అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని రైల్వే డీఆర్ ఎం అనూప్‌కుమార్ సత్పతి శనివారం తెలిపారు.