ఒడిశాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బెంగాల్ కు చెందిన ప్రయాణికులు పెద్ద సంఖ్యలో మరణించారు. దీంతో కాసేపటి క్రితం ఒడిశా చేరుకున్న దీదీ, ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.