మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ కొనసాగుతోంది. మూడు గంటలుగా ఎంపీని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు విచారణ సాగనుంది. వాట్సప్ కాల్స్, నిందితులతో పరిచయాలపై సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియోలు సీబీఐ అధికారులు చిత్రీకరిస్తున్నారు. వివేకా హత్యకు వాడిని గొడ్డలిపై కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయంపై ఆరా తీస్తోంది. వివేకా మరణంపై జగన్ మోహన్ రెడ్డికి ముందుగా ఎవరు చెప్పారన్న విషయాన్ని సీబీఐ లేవనెత్తింది. అయితే తనకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని అవినాశ్ సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అవినాష్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.