ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నాగవంశ కులస్థులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి చేర్చాలని టీడీపీ నాగవంశ సాధికర సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎరుబోతు రమణారావు కోరారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చం ద్రబాబును శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో పలువురు నాగవంశ కులస్థు లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా 6 లక్ష ల జనాభా కలిగిన నాగవంశ కులస్థులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారన్నారు. బీసీ-డీలో ఉండటం వలన తమకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ-ఏలో చేర్చాలని కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్టు ఎరుబోతు రమణ తెలిపారు. సమితి రా ష్ట్ర నేతలు మొకర ఆదిబాబు, బుగత శ్రీరాములు, బోని నాని, కాళ్ల ఈశ్వ ర్, ఎచ్చెర్ల అనిల్, రాబిల్లి రాజు, అవనాపు శ్రీను, కనకారావు పాల్గొన్నారు.