రష్యా ఆక్రమించుకున్న భూ భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తెలిపారు. రష్యాపై ఎదురు దాడులు చేసేందుకు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. విజయం సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. విదేశాల నుంచి తమకు అధునాతన ఆయుధాలు అందాయని వెల్లడించారు.