ట్రైన్ కొలైజన్ అవాయిడెన్స్ సిస్టమ్ పేరుతో రైళ్లలో ప్రమాదాలను అరికట్టేందుకు ఉద్దేశించిన టెక్నాలజీని 2012లోనే అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. 2019లో బీజేపీ ప్రభుత్వం దీనికి ‘కవచ్’గా పేరు పెట్టింది. రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, రైల్వే పట్టాల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమరుస్తారు. దీని వల్ల ఒకే ట్రాక్‌లో 2 రైళ్లు వస్తే లోకోపైలట్ ప్రమేయం లేకుండానే బ్రేకులు పడి రైళ్లు ఆగిపోతాయి.