ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్ పర్యటనకు ముందు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ 2 రోజుల పర్యటన కోసం ఆదివారం ఇండియా రానున్నారు. బైడెన్‌తో మోదీ జరిపే చర్చల్లో రానున్న కొత్త రక్షణ సహకార ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో ఆస్టిన్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు జర్మనీ డిఫెన్స్ ఫెడరల్ మంత్రి కూడా సోమవారం 4 రోజుల పర్యటన కోసం భారత్‌లో అడుగుపెట్టనున్నారు.