ఒడిశాలో జరిగిన ఘోర ప్రమాదంతో దక్షిణ, సౌత్ ఈస్ట్ రైల్వేజోన్లలో 90 రైళ్లను రద్దు చేసి, 46 రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. 11 రైళ్ల గమ్య స్థానాలను కుదించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు విజయవాడ మీదుగా నడిచే 51 రైళ్లు రద్దయ్యాయి. మరో 29 రైళ్లను దారి మళ్లించారు. ఏడు రైళ్లను చేరాల్సిన గమ్యస్థానం కంటే ముందు స్టేషన్లలో ఆపేసి పాక్షికంగా రద్దు చేశారు.