ఒడిశాలో బాలేశ్వర్ సమీపంలోని బహానగాబజార్ స్టేషన్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు ముఖ్య కారణాలపై ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. ప్రధాన లైన్లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఆకస్మికంగా లూప్లైన్లోకి దూసుకెళ్లి అక్కడున్న గూడ్స్‌ను ఢీకొనడమే కారణమని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు శనివారం ప్రాథమిక నివేదిక రూపొందించారు.