దైవ దూషణ చేసాడనే ఆరోపణలతో ఓ క్రైస్తవ యువకిడికి కోర్టు మరణశిక్ష విధించిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. బహవల్పూర్లో ఇస్లామ్ కాలనీకి చెందిన 19 ఏండ్ల నౌమాన్ మసేహ దైవాన్ని దూషిస్తూ పోస్టులు షేర్ చేశాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి వాట్సాప్ లో అతడు పంపిన మెస్సేజ్లను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతనికి మరణశిక్షతో పాటు, 20 వేల రూపాయల జరిమానా విధించింది.