రూ. 1 కన్నా తక్కువ చెల్లింపుతో రైల్వే శాఖ 10 లక్షల వరకు బీమా కల్పిస్తోంది. ఆన్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు బీమా కోసం రూపాయి కన్నా తక్కువ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ బీమా తీసుకున్న వారు రైలు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడితే రూ. 10 లక్షలు చెల్లిస్తారు. తీవ్రంగా గాయపడి అంగ వైకల్యం ఏర్పడినప్పుడు రూ.7.5 లక్షలు, క్షతగాత్రులకు వైద్యఖర్చుల నిమిత్తం రూ.2 లక్షలు అందిస్తారు.