ప్రభుత్వం మరియు సామాజిక భాగస్వాముల ఉమ్మడి కృషితోనే యమునా నది పునరుజ్జీవనం జరుగుతుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదివారం అన్నారు. "యమునా సంసద్" కార్యక్రమంలో రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. యమునా నది ప్రక్షాళనకు నగర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీ పర్యావరణ మంత్రి తెలిపారు."అయితే, రసాయనాలు, ప్లాస్టిక్‌లు మరియు ఇతర జీవఅధోకరణం చెందని కాలుష్య కారకాలు అధికంగా విడుదల చేయడం వల్ల నది యొక్క పర్యావరణ సమతుల్యత కాలక్రమేణా విఘాతం కలిగింది. అయినప్పటికీ, ఈ పవిత్ర నది పవిత్రతను కాపాడేందుకు మా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది," అన్నారాయన. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రచారాన్ని ఒక ముఖ్యమైన అంశంగా ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.