ఓ ప్రేమజంట మెట్రో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కోల్ కతా లో జరిగింది. నగరంలోని నోవాపరా మెట్రో స్టేషన్లో రైలు వస్తుండగా ఓ యువతి, యువకుడు అకస్మాత్తుగా పట్టాలపై దూకి అడ్డంగా పడుకున్నారు. క్షణాల్లోనే ఈ పరిణామం జరగడంతో అదే వేగంలో వారిద్దరి మీద నుండి దూసుకెళ్లింది. దీంతో యువతి, యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.