చిన్న బడ్జెట్ పాఠశాలలను, కార్పొరేట్ పాఠశాలలతో తమను పోల్చవద్దని ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ కు మరియు మదనపల్లె మునిసిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. సోమవారం స్పందన కార్యక్రమం లో భాగంగా ప్రైవేట్ రికగ్నైజ్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో మదనపల్లె ఆర్డీఓ మురళి, మదనపల్లె మునిసిపల్ కమీషనర్ ప్రమీల ను కలసి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే తాము వాణిజ్య పన్నును చిన్న బడ్జెట్ పాఠశాలల భవనాలకు చెల్లిస్తున్నామని, అంతే కాకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు. కావున యూజర్ ఛార్జీలు చెల్లించ కుండా మినహాయించాలని అభ్యర్తించారు. అలాగే బిల్డింగ్ కమర్షియల్ ట్యాక్స్ నుండి కూడా మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో పలు పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రేమ్సా సభ్యులు పాల్గొన్నారు.