గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మృతి చెందిన ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల సాయం అందించాలని బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు.