ప్రభుత్వ ఉద్యోగులపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి మంత్రి అతిథిగా హాజరయ్యారు. అయితే వేదికపైకి వచ్చిన మంత్రికి ఎలా గౌరవం ఇవ్వాలో తెలియదా? ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులకు ఏం నేర్పుతున్నారని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. 'మంత్రిని వేదిక మీదకు వస్తున్నాను.. జ్ఞానం ఉందా.. మైండిట్..ఒళ్లు జాగ్రత్త పెట్టుకోండి' అని హెచ్చరించారు.