ఒడిశా రైలు ప్రమాదం ఓ నవ వధువును ఒంటరిదాన్ని చేసింది. బీహార్ కు చెందిన రూప, అఖిలేశ్(22)కు గత నెల 7న వివాహం జరిగింది. అఖిలేశ్ బతుకుదెరువు కోసం చెన్నై వెళ్తూ ఒడిశా రైలు ప్రమాదంలో మృతిచెందాడు. అధికారులు ఆధార్ కార్డు ద్వారా అఖిలేశ్ ను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పెళ్లైన నెల లోపే భర్త మరణించడంతో రూప గుండెలు పగిలేలా రోదిస్తోంది.