గుంటూరు, స్థానిక పట్టాభిపురంలోని రైల్ వికాస్ భవన్లో బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ మీటింగ్ గుంటూరు రైల్వే డి అర్ యమ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతినిధులు ఏ ఆర్ కే రాజు ఇండియా సిమెంట్ /విష్ణుపురం, ప్రేమ్ కుమార్ చెట్టినాడు, శాంతి స్వరూప్ వేర్ హోసింగ్ అండ్ లాజిస్టిక్స్, సిమెంట్ గూడ్స్ లోడు అండ్ అన్లోడ్ ప్రతినిధులతో పాటు యఫ్ సి ఐ అధికారులు వున్నారు. ఎరువుల లోడింగ్ మరియు అన్లోడింగ్ కంపెనీల ప్రతినిధులు లోడింగ్ సమయంలో నిర్దేశిత సమయాని తగ్గించమని అభ్యర్థించారు. లోడింగ్ అన్లోడింగ్ సమయంలో మాన్ పవర్ కాకుండా మెకానైజడ్ పవర్ ఉపయోగించాలని కోరారు. కస్టమర్స్ లేవనేతిన్న సమస్యలను పరిష్కరిష్తామని హామీ ఇచ్చారు.