నేడు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ మొదలైనది. సీపీఎస్ రద్దు చేసి మెరుగైన గారెంటీ పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు సవాలక్ష నిబంధనలకు నేడు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఉద్యోగులకు సంబంధించి బకాయిలు వచ్చే ప్రభుత్వంపై నెట్టేయడంతో పాటు పలు కీలక అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. గ్రూప్ వన్, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. విద్యా కానుక, అమ్మఒడి పథకాలపై కేబినెట్‌లో చర్చ జరపనుంది. జూన్, జులైలో అమలు చేసే సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు.