హజ్ యాత్రకు ముస్లింలు భారీగా తరలివెళ్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 9 గంటలకు ఏస్ జి 5007 విమానం ప్రారంభం కానుంది. 170 మంది ప్రయాణికులతో నేరుగా జెడ్డాకు విమానం చేరుకోనుంది. 41 రోజుల పవిత్ర హజ్ యాత్రను ముగించుకుని జూలై 17న తిరిగి హజీలు ఏపీకి రానున్నారు. అన్ని జిల్లాల నుంచి యాత్రికులను విజయవాడ తీసుకొచ్చేందుకు వాల్వో బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే 1,813 మందిపై తలో రూ.83 వేల అదనపు భారం మోపుతున్నారు. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నారు. హజీలకు రూ.14.51 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.