మహానాడు వేదికపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మన పథకాల పేర్లు మార్చి పులిహోర మేనిఫెస్టో ప్రకటించారని సీఎం సెటైర్లు వేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉన్నందున క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేయాలని జగన్ మంత్రులకు సూచించారు.