తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ-ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. చెత్త సేకరణకు రూ. 4. 10 లక్షల విలువైన 516 ఈ-ఆటోలను మొత్తం రూ. 21. 18 కోట్ల వ్యయంతో కొనుగోలు చేశారు. ఆటో సామర్థ్యం 500 కిలోలు కాగా, వీటిని 36 చిన్న మున్సిపాలిటీలకు పంపిణీ చేయనున్నారు. అయితే మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తూ ‘ఈ-ఆటో‘ డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.