కొత్తపేట నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో 80 లక్షల రూపాయలతో మరియు ఆలమూరు గ్రామంలో 1కోటి రూపాయలతో నిర్మించనున్న బి. సి. కమ్మునిటీ భవనాలకు గురువారం జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.