రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగుల పక్షపాతి అని, క్యాబినెట్ లో విప్లవాత్మక నిర్ణయాలతో మరోసారి రుజువు చేసుకున్నారని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు తదితరులతో కలిసి కృపారాణి మాట్లాడారు. అధికారం.. చుర్చీ కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడగల అనైతిక నాయకుడు చంద్రబాబు అని కౄపారాణి మండిపడ్డారు. ప్రజల్లో ఉద్యోగులు కూడా భాగస్వామ్యం అని, వారి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రంలో జగన్‌మోహనరెడ్డి పాలన సాగిస్తున్నారని కృపారాణి స్పష్టం చేశారు. క్యాబినెట్ లో ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కౄపారాణి తెలిపారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా, రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘ నాయకులతో మాట్లాడనని వారంతా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారని చెప్పారు. ఫెన్షన్‌తో ఉద్యోగ భద్రత ఉంటుందని భావించి ఉద్యోగుల ప్రయోజనం కోసం సీపీఎస్ స్థానంలో జీపీఎస్ విధానాన్ని అమలు చేసి వే ఆఫ్ హోప్ ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపారని ఆమె తెలిపారు.