వాహనదారులకు తీపి కబురు అందింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నష్టాల నుంచి కంపెనీలు దాదాపుగా కోలుకున్నాయని త్రైమాసిక ఫలితాల్లోనూ రాణించడమే ఇందుకు కారణమని తెలిపాయి. కాగా ఇవాళ ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.