సీఆర్డీయే కమిషనర్‌ను అమరావతి రైతు సమన్వయ కమిటీ నేతలు కలిశారు. కౌలు చెల్లింపు ఆలస్యంపై గంటకుపైగా కమిషనర్‌తో చర్చలు జరిపారు. ఈనెల 25వ తేదీలోగా కౌలు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే సీబీసీఐడీ కేసులు త్వరగా తేల్చాలని రైతు నేతలు కోరారు. సెంట్ స్థలాలు డెవలప్మెంట్ చేసిన విధంగా రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.