అభివృద్ధి ప్రజ సంక్షేమమే లక్ష్యంగ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం సమన్వయ కర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కెకె రాజు అన్నారు. ఈమేరకు జీవీఎంసీ 14 వ వార్డు బాలయ్య శాస్త్రి లేఔట్ వద్ద వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో 2. 53 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబందించి గురువారం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి తో కలిసి కెకె రాజు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్బంగా కెకె రాజు మాట్లడుతూ రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఆర్దిక బరోసా కల్పించే విదంగా ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆయా సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేవిధంగా వాలంటియర్ వ్యవస్థ స్థాపించడంతో పాటుగా ప్రతి నాయకుడు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి రూపకల్పన చేసారని గుర్తు చేసారు. కార్యక్రమంలో బాగంగా ఏర్పాటు చేసిన శీలా పలకాన్ని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కెకె రాజు ప్రారంభించారు. లంక భాస్కర్, బల్ల శ్రీనివాస్ కెవిబిఎస్ఎన్ రాజు, కోడూరు సత్యనారాయణ, భోగలింగేశ్వరరావు, రాజకుమారి, శేషు, ప్రవీణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.