కర్నూలు జిల్లా గూడూరులోని పడమర బీసీ కాలనీలో నివాసం ఉంటున్న తెలుగు నాగరాజు రైతు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే.... నాగరాజు కు సొంత పొలం మూడు ఎకరాలు ఉంది. ఈ పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. అయితే దిగుబడి సరిగా రాకపోవడంతో పంటల సాగు కోసం చేసిన రూ.8 లక్షల అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజు భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ విక్టరిబాబు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.