రైలుకు ఎదురెళ్లి ఓ మహి ళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన దొనకొండ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారంరాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు... పల్నాడు జిల్లా, వినుకొండ పట్టణంలోని దేవానగరానికి చెందిన పగడాల బుజ్జి(52)కి 20 ఏళ్ల క్రితమే భ ర్త వీరయ్య మృతి చెందాడు. కుటుంబ పోషణ నిమిత్తం గ్రామాల్లో తెల్లగడ్డలు, ధనియాలు తదితర వస్తువులు అమ్ముతూ జీవిస్తుంది. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేసి కొడుకు, కోడలు వద్ద ఉంటుంది. ఇటీవల కుటుంబ పరిస్థితుల కారణంగా జీవితంపై విరక్తి చెంది మంగళవారం సాయంత్రం సంచిలో దుస్తులు సర్ధుకొని దొనకొండ చేరింది. అర్ధరాత్రి యశ్వంత్పూర్ నుంచి మచిలీపట్నం వెళ్లే కొండవీడు ఎక్స్ప్రెస్ వేగంగా వస్తుండగా పట్టాల మధ్యలో నిలబడింది. రైలుదగ్గరకు వచ్చేలోపు భయపడి రైలు పట్టాలు దిగి క్రమంలో రైలు స్వల్పంగా ఢీకొట్టడంతో తల పగి లి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పక్కనే సంచిలో ఉన్న ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రైల్వే ఎస్సై సుబ్బారావు, జీఆర్పీ ఇన్చార్జి పూర్ణమహేశ్వరరావులు కేసు నమోదు చేసి మృతదేహన్ని వినుకొండ వైద్యశాలకు తరలించారు.