ఉద్యమం చేయకపోతే ఉద్యోగుల ప్రయోజనాలు ఉండవని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా చాలా సమయం ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఫిబ్రవరిలో ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరినా అమలు చేయలేదని.. ఒప్పందాలు అమలు చేయకపోగా దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని మండిపడ్డారు. 92 రోజుల పాటు ఉద్యమం చేసి హక్కులు సాధించుకున్నామని తెలిపారు. అన్ని సమన్వయం చేసుకుంటూ నల్ల బ్యాడ్జీలతో ఉద్యమించామన్నారు. 26 జిల్లాలలో ఒకేసారి ఉద్యమం ప్రారంభించామని చెప్పారు. కారుణ్య నియామకాలు ఉద్యమ ఫలితమే అని తెలిపారు. గ్రామ సచివాలయాలలో ఉద్యోగుల టార్గెట్ రద్దు చేశారని.. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ప్రభుత్వం వాడుకుందని ఆయన విమర్శించారు.