దేశీయ స్టాక్ మార్కెట్ల ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలకు తోడు ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ సూచీ 97 పాయింట్లు నష్టపోయి 62,752 వద్ద ట్రేడవుతోంది. ఇక నేషనల్ స్టాక్స్ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ 25 పాయింట్ల నష్టంతో 18,609 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.