వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఆయన కూతురు సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నేడు ధర్మాసనం ముందు సునీత రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కేసు మెన్షన్ చేశారు. మంగళవారం విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. అవినాష్ రెడ్డి ప్రధాన కుట్ర దారుడు అని, దర్యాప్తు సంస్థ అరెస్టు చేయకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని వాదనలు సందర్భంగా సిద్దార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు . ఏప్రిల్ 24న సీజేఐ ధర్మాసనం ఆదేశాల తర్వాత... సీబీఐ నాలుగు సార్లు అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసినా... విచారణకు హాజరు కాలేదన్నారు. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికి స్థానిక ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, సీబీఐ విచారణను అడ్డుకుంటోందని వెల్లడించారు.