పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్య సిబ్బంది 36 మందికి వైద్య పరీక్షలు చేశారు. మందులు పంపిణీ చేసినట్టు మెడికల్ ఆఫీసర్ కిరణ్మయి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈ ఓ మురళి, సూపర్వైజర్ హరి ప్రసాద్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ ఆబిద్ అలీ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.