40 రోజులుగా అమెజాన్ అడవుల్లో చిక్కుకుపోయిన నలుగురు పిల్లలు ఎట్టకేలకు దొరికారు. ఈ మేరకు కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో ప్రకటించారు. మే నెల 1వ తేదీన చిన్న విమానం అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. అందులో పైలట్, ఆ పిల్లల తల్లి, మరొక బంధువు.. మొత్తం ముగ్గురూ చనిపోగా.. 13, 9, 4 ఏళ్ల పిల్లలతో పాటు 11 నెలల పసివాడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వీరికోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా 40 రోజులకు దొరికారు.