మాచవరం మండలంలోని ఎంపీడీవో కార్యాలయం నందు శనివారం సమావేశ మందిరంలో మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కే. రామమ్మ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉన్నాయని రైతులు 50 శాతం రాయితీపై వినియోగించుకోవాలని కోరారు. డి. టి , మాచవరం సుబ్బారావు మాట్లాడుతూ కౌలుకు వేసిన ప్రతి రైతు కౌలు కార్డు తీసుకోవాలని కోరారు.
బి. వర ప్రసాధ్ యం. పి. డి. ఓ, మాచవరం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సిబ్బంది ఉపాధి హామీ పథకంలో ఉన్న ఉద్యాన పంటల రాయితీని ప్రతి రైతు వినియోగించుకునేలా చేయాలని తెలిపారు.