అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు (UCB)లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కొత్త చర్యలను తీసుకుందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. RBI అనుమతి లేకుండానే UCBలు కొత్తగా బ్రాంచ్‌లను ఓపెన్ చేయొచ్చన్నారు. రుణ గ్రహీతలతో కమర్షియల్ బ్యాంకుల మాదిరిగా వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకోవచ్చన్నారు. ప్రాధాన్య రంగాలకు రుణ లక్ష్యాలను చేరుకోవడానికి గడువును 2026, మార్చి 31 వరకు పొడిగించామన్నారు.