మంత్రి రోజా చొరవతో పంచ్ ప్రసాద్‌కు ఏపీ సర్కార్ అండగా నిలిచింది. ఇదిలావుంటే జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రసాద్‌కు అండగా నిలిబడింది.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయానికి ముందుకొచ్చింది. అయితే మంత్రి రోజా చొరవ తీసుకుని పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ వెంటనే స్పందించి.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్‌కి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న పంచ్ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం వైద్యం అందిస్తోంది.
మంత్రి రోజా మంచి మనసు ఓ నెటిజన్ సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం గురించి తెలిసి సాయం చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు.. జబర్దస్త్‌లో తన ఆరోగ్య పరిస్థితిపై కూడా స్కిట్‌లు చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. కానీ గతంలో రోజాను జబర్దస్త్ అంటూ ట్రోల్ చేశారని.. కానీ ఇప్పుడు ఆమె సీఎంఆర్‌ఎఫ్‌కు రికమెండ్ చేసి పంచ్ ప్రసాద్‌కు సాయం చేసేలా చూశారని ప్రశంసిస్తున్నారు. రోజాది మంచి మనసు అంటూ పొడగ్తల వర్షం కురిపిస్తున్నారు.
పంచ్ ప్రసాద్ కిగ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తోటి జబర్దస్త్ నటుడు నూకరాజు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ విషయాన్ని ఓ నెటిజన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన సీఎం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ.. తమ టీం పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేస్తున్నామని.. డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంత త్వరగా క్లియర్ చేశామన్నారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా కూడా పంచ్ ప్రసాద్ కోసం ఆర్థిక సాయం కోరుతూ పోస్ట్‌లు పెట్టారు. దాతలు స్పందిస్తూ వారికి చేతనైన సాయం అందిస్తున్నారు.
మరోవైపు పంచ్ ప్రసాద్ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటునట్లు చెబుతున్నారు. ఆయనకు సర్జరీ చేయాల్సి ఉందని.. అది పూర్తికాగానే పూర్తిగా కోలుకుంటున్నారని అంటున్నారు. పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకుని మళ్లీ జబర్దస్త్‌లో తన పంచులతో మళ్లీ అందర్నీ నవ్వించాలని నెటిజన్లతో పాటూ అందరూ కోరుకుంటున్నారు. అలాగే ప్రసాద్‌కు అండగా నిలిచిన ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.