ఒడిశాలో ఇటీవల రైలు ప్రమాదం జరిగి 288 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మరో రైలు ప్రమాదం జరిగింది. మిద్నాపూర్ నుండి హౌరా వెళ్తున్న రైలు చివరి బోగి ఖరగ్ పూర్ యార్డ్ వద్ద నిన్న రాత్రి పట్టాలు తప్పింది. అయితే, రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. రైలును అక్కడినుండి తరలించినట్లు తెలిపారు.